close

తాజా వార్తలు

Updated : 06/08/2020 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీవీ నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్య

ముంబయి: బాలీవుడ్‌ సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణం తర్వాత సినీ రంగానికి చెందిన పలువురు నటుల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో కన్నడ బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా హిందీ టీవీ సీరియల్‌ నటుడు సమీర్‌ శర్మ ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. ముంబయిలోని తన అపార్టుమెంట్‌లో సమీర్‌ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘కహానీ ఘర్‌ ఘర్‌ కీ’, ‘మే రిష్తే హై ప్యార్‌ కే’, ‘జ్యోతి’, ‘లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌’, ‘ఏక్‌ బార్‌ ఫిర్‌’ వంటి పలు ధారావాహికల్లో నటించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన