
తాజా వార్తలు
మోండామార్కెట్కు ఎన్నేళ్లు.. ఖైరతాబాద్ కహాని ఏంటి.?
మోండా మార్కెట్
ఇంటర్నెట్ డెస్క్ : నగరంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంది. ఆయా ప్రాంతాలకు పేరు పెట్టడంలోనూ అనేక అంశాలు దాగున్నాయి. ఆనాటి నుంచి ఇవి నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూనే ఉన్నాయి. నాటి వైభవాన్ని నేటికి చాటుతూ భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేస్తున్నాయి. వాటిలో కొన్నింటి విశిష్టతల గురించి తెలుసుకుందాం..
140 ఏళ్ల మోండా మార్కెట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న మోండా మార్కెట్‌కు 140 ఏళ్ల చరిత్ర ఉంది. 1880లో దీన్ని నిర్మించారు. ఇండో ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ మార్కెట్ బ్రిటీష్ సైనికుల అవసరాల కోసం ఏర్పాటు చేశారు. 1936లో ఏడో నిజాంకాలంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఈ మార్కెట్‌నే హిస్సాంగంజ్ మోండా మార్కెట్, హిస్సాంగంజ్ అని కూడా స్థానికులు పిలుస్తుంటారు. మోండా మార్కెట్ ప్రారంభంలో ఉన్న ఆర్చి(కమాన్) గ్రేడ్-2ఏ రక్షిత వారసత్వ నిర్మాణంగా ప్రకటించారు.
ఫిరంగుల కేంద్రం.. గన్ ఫౌండ్రీ
గన్‌ఫౌండ్రీ అంటే ఫిరంగుల తయారీ కేంద్రంగా చెబుతుంటారు. నిజాం కాలేజీ మైదానం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సెయింట్ జార్జి చర్చి, గ్రామర్ స్కూల్ వరకూ ఉన్న ప్రాంతమంతా గన్‌ఫౌండ్రీ ప్రాంతంగా పిలుస్తుంటారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండేది. నిజాం నవాబుల కాలంలో సైనికులకు అవసరమయ్యే ఫిరంగులను ఈ ప్రాంతంలో తయారు చేసేవారు. ఫిరంగుల తయారీ కేంద్రంగా ఉండటంతో దీనికి గన్ఫౌండ్రీగా పేరు వచ్చింది. ఇక్కడ తయారైన ఫిరంగులు గోల్కొండ కోట బురుజుల్లో, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి ఎదురుగా ఉన్న గన్‌పార్కు, పబ్లిక్ గార్డెన్స్, సికింద్రాబాద్‌లోని మిలిటరీ క్యాంపు తదితర ప్రాంతాల్లో అలంకారప్రాయంగా నేడు మనకు దర్శనమిస్తాయి.
సైఫాబాద్- లక్డీకపూల్ ప్రాంతం
సైఫ్జంగ్- సైఫాబాద్
లకిడి అంటే కలప.. పూల్ అంటే బ్రిడ్జి.. ఈ లకడి-క-పూల్‌కి ఇరువైపులా ఉన్న ప్రాంతం నాలుగో నిజాం కాలంలోని పేష్కార్ జఫ్రరుద్దౌలా సైఫ్జంగ్ పేరు మీద సైఫాబాద్గా ప్రసిద్ధి పొందింది.
ఖైరున్నీసా.. ఖైరతాబాద్
1570 ప్రాంతంలో కులీకుతుబ్‌షా కుమార్తె ప్రిన్సెస్ ఖైరున్నీసా ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. నైరుతి దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని భావించారు. దీంతో ఈ ప్రాంతాన్ని ప్రిన్సెస్ నివాసం కోసం ఎంపిక చేశారు. ప్రముఖ ఇంజినీరు, కుతుబ్‌షా అల్లుడు హజ్రత్ హుస్సేనీ షావలిని పురమాయించి ఖైరున్నీసా కోసం ఒక ప్యాలెస్, ఒక పెద్ద మంచినీటి చెరువు, మసీదు నిర్మించారు. ఆ పెద్ద ట్యాంకు పేరే హుస్సేన్సాగర్గా నేడు పిలుస్తున్నారు. ఈ ప్రాంతం ఖైరున్నీసా పేరున ఖైరతాబాద్‌గా పేరుపొందింది.
బేగంబజార్
కుర్షిదియా- బేగంబజార్
మూసారం బ్రిడ్జికి ఉత్తరాన, గోషామహల్‌కు దగ్గర ఉన్న ప్రాంతమంతా బేగంబజార్గా పిలుస్తున్నారు. నిజాం అలీఖాన్ అసఫ్‌జాహీ-2(1763- 1803) తల్లి కుర్షిదియా బేగం. ఆమె పేరు మీద ఈ ప్రాంతమంతా బేగంబజారుగా నేడు ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు ఇది పెద్ద వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతోంది.
జాగీర్ధారీల అమీర్‌పేట
నిజాంల పాలనలో అధికారులుగా పనిచేసే జాగీర్ధారు(సంపన్నులు)లు ఈ ప్రాంతంలో నివసించేవారు. అమీర్ అంటే సంపన్నులు అని అర్థం. దీంతో ఈ ప్రాంతానికి అమీర్‌పేట అని పేరు వచ్చింది. దీంతో పాటు రాష్ర్టంలోనే అధికంగా సిక్కులు నివసిస్తున్న ప్రాంతం కూడా ఇదే.
పురానాపూల్
అరుదైన నిర్మాణం పురానాపూల్
హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన 1591లో జరిగింది. అంతకు 14 ఏళ్లకు ముందే అంటే సుమారు 1578లో మూసీనదిపై ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోల్కొండ కోట- కార్వాన్ ప్రాంతీయులు మూసీ దాటి కొత్తగా ఏర్పాటైన నగరానికి చేరుకునేందుకు దీన్ని ఉపయోగించేలా ఇబ్రహీం కుతుబ్‌షా నిర్మించారు. ఈయన కుమారుడు ప్రిన్స్ మహ్మద్ కులీ తన ప్రియురాలు శాలిబండ ప్రాంతంలోని చంచలం గ్రామంలో ఉన్న భాగమతిని చేరుకునేందుకు రోజూ మూసీని ఈదుకుంటూ వెళ్తున్నాడని తెలిసి ఈ బ్రిడ్జిని నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. ఫ్రెంచి యాత్రికుడు 1676లో హైదరాబాద్‌ను సందర్శించినపుడు ఈ బ్రిడ్జి నిర్మాణ తీరును చూసి ఆశ్చర్యపడ్డారు. ఆసఫ్‌జాహీల కాలంలో మూసీ పైన చాదర్‌ఘాట్ వద్ద 1839లో మరో వంతెనను నిర్మించారు. ఆనాటి నుంచి కుత్బ్షాలు నిర్మించిన మొదటి బ్రిడ్జినీ పురానాపూల్‌గా పిలవడం ప్రారంభించారు.
నాటి నవాబు జాగిరే.. ముషీరాబాద్
హుస్సేన్‌సాగర్‌కు తూర్పుగా చిక్కడపల్లి అనే గ్రామం ఉండేది. ఈ ప్రాంతాన్ని మూడో నిజాం జాగీరుగా నవాబ్ అరస్తుజా ముషీర్-ఉల్-ముల్క్కు అప్పగించారు. ఆ నవాబు 1785లో ఈ ప్రాంతంలో ఒక పెద్ద ప్యాలెస్- పూదోట అభివృద్ధి చేశారు. ఆయన పేరు మీద ముషీరాబాద్గా నేడు ప్రసిద్ధి చెందింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
