‘లైగర్‌’ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌
close

తాజా వార్తలు

Published : 06/04/2021 23:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘లైగర్‌’ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘లైగర్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా అలరించనున్నాడు. విజయ్‌ సరసన బాలీవుడ్‌ భామ అనన్యపాండే సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నిపుణులు పనిచేయనున్నారట. జాకీచాన్‌తో పాటు మరెంతో మంది హాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో కలిసి పనిచేసిన ప్రముఖ యాక్షన్‌ డైరెక్టర్‌ ఆండీ లాంగ్‌ ఈ సినిమాలో హైవోల్టేజ్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆండీ టీమ్‌లోని సభ్యులంతా ప్రపంచంలో వివిధ దేశాలకు చెందినవాళ్లు కావడం విశేషం. ముంబయిలో భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన ఓ సెట్‌లో ఈ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా వస్తున్న తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్‌ 9న ‘లైగర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని