close

తాజా వార్తలు

Published : 02/03/2021 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి అద్దె అడిగితే అంతమొందించాడు

పాలకొల్లు టౌన్‌: తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని కిరాయి అడిగినందుకు యజమాని హత్యకు గురైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్‌(50) ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య కుటుంబం అద్దెకు ఉంటోంది. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. ఈ విషయమై ఇంటి యాజమాని, చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో యజమాని తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని