close

తాజా వార్తలు

Published : 11/02/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వేరియంట్లను ఎలా గుర్తిస్తారంటే..

వాషింగ్టన్‌: గత సంవత్సరకాలంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తీరా వ్యాక్సిన్లు తయారయ్యి అవి అందుబాటులోకి వచ్చేసరికి కరోనా జన్యు మార్పులు చెందుతూ కలవరపెడుతోంది. ఇప్పటికే యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాల్లో కొత్త రకం వైరస్‌ వెలుగు చూసింది. ఇవి సాధారణ వైరస్‌ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి.

అసలు ఒక వైరస్‌లో వివిధ వేరియంట్లను పరిశోధకులు ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న చాలా మందికి కలిగే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వైరస్‌లలో ఉత్పరివర్తనాలను గుర్తించేందుకు పరిశోధకులు కరోనా సోకిన వారి నుంచి నమూనాలను సేకరిస్తారు. తర్వాత దానిని ‘జీనోమ్‌ సీక్వెన్సింగ్‌’ అనే పద్ధతి ద్వారా పరిశీలిస్తారు. చాలా కాలంగా ఈ పద్ధతినే మొక్కలు, జంతువులు, మానవులను అధ్యయనం చేసేందుకు వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 5లక్షలకు పైగా కరోనా జన్యువులను గుర్తించారు. కరోనా ఒక వ్యక్తికి సోకిన తర్వాత శరీరంలో కరోనా కణాలు వాటి కాపీలను వృద్ది చేసుకుంటాయి. ఈ వైరస్‌ నమూనాలను నిశితంగా పరిశీలించడం వల్ల జన్యువులో వచ్చే మార్పులను గమనించవచ్చని మిన్నెసోటా ఆరోగ్యశాఖ అసిస్టెంట్‌ ల్యాబ్‌ డైరక్టర్‌ సారా వెటర్‌ తెలిపారు. ‘‘ వైరస్‌లో ఇప్పటి వరకూ వచ్చిన ఉత్పరివర్తనల్లో చాలా వరకూ అంత ప్రమాదకరమైనవి కావు. కానీ అవి ఎక్కువగా వ్యాపించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి కొవిడ్‌ చికిత్సను నిరోధిస్తాయి.’’ అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, యూకేలలో వెలుగు చూసిన వైరస్‌ వేరియంట్లపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి తేలికగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతమున్న కొవిడ్‌ టీకాలు ఈ వేరియంట్లను అడ్డుకుంటాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్‌ మ్యుటేషన్‌పై ఈ వ్యాక్సిన్‌లు పనిచేయవని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఇవీ చదవండి..

తపోవన్‌లో నిలిచిన సహాయక చర్యలు

కరోనా మొదటి రోజులు అత్యంత కీలకం



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని