Covid-19 patient: ఎంత ఆక్సిజన్‌ అవసరం?
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid-19 patient: ఎంత ఆక్సిజన్‌ అవసరం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ మృత్యు ఘంటికలను మోగిస్తోంది. మునపటి కన్నా వ్యాధి తీవ్రత అధికమైంది. సెకండ్‌ వేవ్‌లో కరోనా పేషెంట్లు అక్సిజన్‌ స్థాయులు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వైరస్‌ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపడం వల్లే ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన వాళ్లలో వ్యాధి తీవ్రతను బట్టి ఆక్సిజన్‌ వినియోగం మారుతూ ఉంటుంది. 93 శాతం కన్నా తక్కువ పల్స్‌ నమోదై ఆక్సిజన్‌ అవసరమైన వాళ్లు 10 శాతం మందే. వాళ్లకు మాత్రమే అదనంగా ఆక్సిజన్‌ అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఊపిరితిత్తులు సరిగా పనిచేయని వాళ్లకు హై ఫ్లో నాజల్‌ క్యానులా (హెచ్‌ఎఫ్‌ఎన్‌సి) ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సగటున నిమిషానికి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల గాలిని పీల్చి వదులుతాడు. అలా ఒక వ్యక్తి రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలి అవసరం. అందులో ఉచ్ఛ్వాశలో 21 శాతం ఆక్సిజన్‌, నిశ్వాసలో 15 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. ఈ ఆక్సిజన్‌ శాతాల్లో కొరత ఏర్పడినప్పుడు శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతాయి. అలాంటప్పుడు ఆక్సిజన్‌ సప్లిమెంట్‌ అవసరం అవుతుంది. కరోనా సోకిన వాళ్లు ఆరు నిమిషాల నడక తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వైద్యుల సలహా మేరకు మెడికల్‌ ఆక్సిజన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఒక కరోనా బాధితుడికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందన్నది వ్యక్తిని బట్టి ఉంటుంది. సగటున నిమిషానికి ఒకటి నుంచి రెండు లీటర్ల మెడికల్ ఆక్సిజన్‌ అవసరం. ఊపిరితిత్తుల పనితీరు లోపించడం వల్ల మెడికల్‌ ఆక్సిజన్‌ అందించే సమయంలో ఆక్సిజన్‌ వృథా అవుతుంది. దానివల్ల పేషెంట్‌కు నిమిషానికి మూడు నుంచి నాలుగు లీటర్ల ఆక్సిజన్‌ వినియోగం అవుతుంది. హై ఫ్లో నాజల్‌ క్యానులా ద్వారా ఆక్సిజన్‌ అందిస్తే నిమిషానికి 60 లీటర్ల, గంటలకు 3,600 లీటర్లు రోజుకు 86 వేల లీటర్ల ఆక్సిజన్‌ అవసరం అవుతుందని వైద్యులు అంటున్నారు. హై ఫ్లో నాజల్‌ క్యానులా ద్వారా ఆక్సిజన్‌ అందిస్తే ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌ నాలుగు గంటలు మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో రీఫిల్లింగ్‌ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది.

ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇవి పరిసరాల నుంచే ఆక్సిజన్‌ను తీసుకుని శుద్ధిచేసి అందిస్తాయి. దీంతో ఎక్కువ మంది ఇంటి వద్దే ఉండి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల సాయంతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, నిమిషానికి రెండు నుంచి మూడు లీటర్ల ఆక్సిజన్‌ అవసరమైన కరోనా బాధితులు మాత్రమే వీటిని వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పటికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే ఆస్పత్రిలో చేరాల్సిందిగా హెచ్చరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని