అందుబాటు ధరలో హెచ్‌పి క్రోమ్‌బుక్‌ 11ఏ
close

తాజా వార్తలు

Published : 07/04/2021 23:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుబాటు ధరలో హెచ్‌పి క్రోమ్‌బుక్‌ 11ఏ

విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని హెచ్‌పి సరికొత్త ‘క్రోమ్‌బుక్‌ 11ఏ’ను భారతదేశ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ క్రోమ్‌ బుక్‌ 11.6 అంగుళాల హెచ్‌డి టచ్  స్క్రీన్‌‌తో వస్తుంది. 37 వాట్స్‌ పర్‌ అవర్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 16 గంటల పాటు పని చేస్తుంది. రెండు స్పీకర్లతోపాటు 720పి హెచ్‌డి వెబ్‌ కెమేరా కూడా దీనిలో ఉంది. మెమొరీ విషయానికి వస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌. ఇన్‌బిల్ట్ మెమొరీ కార్డ్‌ స్లాట్‌ ద్వారా 256 జీబీ వరకూ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. దీనిలో 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌, టైప్‌-సి, యూఎస్‌బి ఏ పోర్టులు ఉన్నాయి.  క్రోమ్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని అన్ని అప్లికేషన్లను దీనిలో వాడుకోవచ్చు. ఒక ఏడాది పాటు ఉచితంగా 100 జీబీ గూగుల్‌ ఒన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇండిగో బ్లూ, బ్లాక్‌ కలర్‌ కాంబినేషన్‌లో ఈ క్రోమ్‌బుక్‌ అందుబాటులో ఉంది. ధర ₹ 21,999.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని