CSK: ఇంట్లోంచే విజిలేస్తానన్న మహిళా క్రికెటర్‌
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CSK: ఇంట్లోంచే విజిలేస్తానన్న మహిళా క్రికెటర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రత్యేక జెర్సీని తనకు పంపించినందుకు ఇంగ్లాండ్‌ మహిళా పేసర్‌ కేట్‌ క్రాస్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఆరోగ్యం కన్నా మరేదీ ముఖ్యం కాదని పేర్కొంది. వాయిదా పడ్డ ఐపీఎల్‌ సీజన్‌ మళ్లీ మొదలవ్వగానే సీఎస్‌కే కోసం ఇంట్లోంచే ఈలల వేస్తానని అంటోంది.

చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందులో క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో  కేట్‌ క్రాస్‌ ఒకరు. ఆమె పేరుతో చెన్నై యాజమాన్యం ఒక ప్రత్యేక జెర్సీని రూపొందించి పంపించింది. 16వ నంబర్‌తో, కేట్‌ అని రాసున్న జెర్సీని వేసుకున్న ఆమె మురిసిపోయింది. వెంటనే కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేసింది.

‘నా తొలి సీఎస్‌కే జెర్సీని పంపించినందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ అధికారులు, జట్టుకు చాలాచాలా ధన్యవాదాలు. సురక్షిత పరిస్థితుల్లో టోర్నీ మళ్లీ మొదలయ్యాక ఇంట్లోంచే నేను విజిల్‌ వేస్తా’ అని కేట్‌ క్రాస్‌ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ను వాయిదా వేసినప్పుడూ ఆమె వెంటనే స్పందించింది. ‘ఐపీఎల్‌ వాయిదా వేసిన వార్త చూడగానే చాలామంది నిరాశకు గురవుతారు. కానీ ఇది సరైన నిర్ణయం. క్రికెట్‌ కన్నా ఆరోగ్యం ముఖ్యం. భారత్‌లో కొవిడ్‌తో పోరాడుతున్న వారికి మేం అండగా ఉంటాం’ అని తెలిపింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని