హోటల్‌కి వెళ్లను.. సెట్‌లోనే నిద్రపోతా
close

తాజా వార్తలు

Published : 24/02/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోటల్‌కి వెళ్లను.. సెట్‌లోనే నిద్రపోతా

విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైగర్‌’. పాన్‌ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ఈ సినిమా షూట్‌ ముంబయిలో తిరిగి ప్రారంభమయ్యింది. విజయ్‌తోపాటు అనన్యా పాండే, రమ్యకృష్ణ షూట్‌లో పాల్గొంటున్నారు. ‘లైగర్‌’ షూట్‌ గురించి తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందించారు.

‘లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో కొన్నినెలలు ఇంటికే పరిమితమయ్యాను. అందుకే ఎలాంటి బ్రేక్‌ తీసుకోకుండా షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని పూరీకి కూడా చెప్పాను. కావాలంటే రాత్రి, పగలు అనే తేడా లేకుండా వరుసగా చిత్రీకరణలో పాల్గొనడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే.. హోటల్‌కి కూడా వెళ్లకుండా ‘లైగర్‌’ సెట్‌లోనే నిద్రపోతానని దర్శక, నిర్మాతలతో చెప్పాను’ అని విజయ్‌ దేవరకొండ వివరించారు.

బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మాస్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘లైగర్‌’ సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని