ఇలా అయితే 3 నెలల్లో దిల్లీవాసులందరికీ టీకా
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా అయితే 3 నెలల్లో దిల్లీవాసులందరికీ టీకా

దిల్లీ: కేంద్రం సహకరిస్తే రానున్న మూడు నెలల్లో దిల్లీలోని ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. అందుకోసం ప్రతినెలా 85 లక్షల డోసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రతిరోజు లక్ష డోసులు ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. దీన్ని మూడు లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

అలాగే త్వరలో దిల్లీలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పెంచుతామని కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రస్తుతం 100 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని.. వీటి సంఖ్యను రానున్న కొన్ని రోజుల్లో 250-300కు పెంచుతామని హామీ ఇచ్చారు. రానున్న మూడు నెలల్లో కేంద్రం 2.6 కోట్ల డోసులు అందించగలిగితే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వగలమని పేర్కొన్నారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతుల కారణంగా నోయిడా, ఘజియాబాద్‌ నుంచి కూడా ప్రజలు వ్యాక్సిన్‌ కోసం వస్తున్నారని కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు కోట్లకు పైగా డోసులు అందించాలని కోరారు. ప్రస్తుతం దిల్లీ వద్ద రానున్న 5-6 రోజులకు సరిపడా వ్యాక్సిన్లు ఉన్నాయని.. వీలైనంత త్వరగా సరిపడా డోసులు సమకూర్చాలని కేంద్రాన్ని కోరారు. అలాగే పిల్లలకు సైతం టీకా అందించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఇటు కేంద్రంతో పాటు పరిశోధకులకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఒక్కటే శరణ్యమని నిపుణులు చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు.    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని