close

తాజా వార్తలు

Published : 14/07/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘‘నాకు భద్రత కల్పిస్తారనే నమ్మకం లేదు’’

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్య

దిల్లీ: ‘‘అనర్హత పిటిషన్‌ రాజ్యాంగ వ్యతిరేకం... నా అనర్హత పిటిషన్ అనర్హం అయిపోతుంది’’ అని నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.  కేంద్ర బలగాల ద్వారా నాకు భద్రత కల్పించాలని 20 రోజుల క్రితం హోం శాఖ కార్యదర్శి కోరాను... ఆ విషయం గురించి మాట్లాడటానికే ఈ రోజు హోం శాఖ కార్యదర్శి కలిశాను అని ఎంపీ చెప్పారు. 

‘‘సాధారణంగా ఎంపీలకు భద్రత కల్పించే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ రాష్ట్ర పోలీసు, రాష్ట్ర ప్రభుత్వం నాకు భద్రత కల్పిస్తారనే నమ్మకం పోయింది. మా ఎమ్మెల్యేలే నాపై కేసులు పెడుతున్నారు. అందుకే కేంద్ర బలగాల రక్షణ కోరాను. భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం జరగాల్సి ఉంది. అందుకే ఆలస్యమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాల రక్షణ వస్తుంది. ఒక ఎంపీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అది కల్పించినప్పుడు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది’’ అని ఎంపీ రఘు రామకృష్ణంరాజు చెప్పారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని