వారం రోజులు.. కుండపోత వర్షాలు
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 22:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారం రోజులు.. కుండపోత వర్షాలు

వెల్లడించిన భారత వాతావరణ కేంద్రం

దిల్లీ: నైరుతి రుతుపవనాల రాకతో దేశంలోని తూర్పు మధ్య ప్రాంతాల్లో రానున్న వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎమ్‌డీ) గురువారం వెల్లడించింది.  రానున్న 2-3 రోజుల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌లలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎమ్‌డీ పేర్కొంది. 

రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతంలోని ఉత్తర ప్రాంతంలో శుక్రవారం అల్ప పీడనం ఏర్పడటం వల్ల ఈ నెల 14 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది.  మహారాష్ట్రలో ఈ నెల 15 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఇప్పటికే ముంబయికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నగరానికి పొరుగున ఉన్న థానె, పాల్ఘార్‌, రాయ్‌గఢ్‌ జిల్లాలకు సైతం భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటకలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు బెంగళూరు ఐఎమ్‌డీ అధికారులు తెలిపారు. కేరళలో ఈ నెల 11-15 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని