ఘోరం.. Oxygen లేక 24 మంది మృతి..?
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘోరం.. Oxygen లేక 24 మంది మృతి..?

కర్ణాటక ఆసుపత్రిలో విషాదకర ఘటన

బెంగళూరు: రెండో దశలో కరోనా మహమ్మారి నేరుగా శ్వాసవ్యవస్థ మీద దెబ్బకొడుతుండటంతో వైరస్‌ బాధితులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువైంది. అయితే, ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు  అల్లాడిపోతున్నారు. సకాలంలో ప్రాణవాయువు అందక నిత్యం ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా కర్ణాటకలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24 మంది మరణించారు. 

చామరాజనగర్‌లోని ఓ కరోనా ఆసపత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక్కరోజే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఉన్నవారే. ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో వారంతా మరణించారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణవాయువు కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్‌ తెప్పించినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తేనే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. చనిపోయిన పేషెంట్లు మొత్తం వెంటిలేటర్లపై ఉన్నవారని.. వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.ఆర్‌.రవి వెల్లడించారు. వీరు ఆక్సిజన్‌ కొరతతోనే మరణించారని చెప్పలేమన్నారు. ఆక్సిజన్‌ సరఫరాకు ఆ మరణాలకు సంబంధం లేదని రవి ది హిందూ పత్రికకు వివరించారు. మరోవైపు ఘటన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చామరాజనగర్‌ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. రేపు అత్యవసర కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. 

దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్‌ కొరత విపరీతంగా ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రముఖ ఆసుపత్రుల్లో ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతో ఇటీవల పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని