
తాజా వార్తలు
పండగవేళ టోల్ ప్లాజాలకు భారీగా ఆదాయం
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలోని టోల్ ప్లాజాలు కాసులతో గలగలలాడాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పరిధిలోని టోల్ ప్లాజాలకు రూ.29.85 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే రూ.5.47 కోట్లు అదనంగా టోల్ ఫీజు వసూలైనట్లు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. ఎన్హెచ్ఏఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వివిధ టోల్ ప్లాజాల వద్ద 81.59శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా, 18.22శాతం మంది నగదు రూపంలో, 0.19శాతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు ప్రధాన రహదారి మినహా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే ఇతర జాతీయ రహదారుల్లో పండగ సందర్భంగా వారం రోజుల వ్యవధిలో 20,55,800 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఒక్క హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ మార్గంలోనే 12,38,942 వాహనాలు రాకపోకలు సాగించినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి..
వాట్సాప్.. ఆ పాలసీ వెనక్కి తీసుకో: కేంద్రం
ఇంగ్లాండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక