close

తాజా వార్తలు

Published : 25/02/2021 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎంఎస్‌ఎన్‌ ఫార్మాలో కొనసాగుతున్న సోదాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ రంగ సంస్థ ఎంఎస్‌ఎన్‌ ఫార్మాలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారుల సోదాలు రెండో రోజు గురువారం కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నం, ఒడిశా, కోల్‌కతా తదితర ప్రాంతాలకు చెందిన 50 బృందాలతో కూడిన ఐటీ అధికారులు ఎంఎస్‌ఎన్‌ కంపెనీతోపాటు దాని అనుబంధ సంస్థల కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంస్థకు చెందిన రసాయనాలు, ఇతర ముడి పదార్థాలను సరఫరా చేసే కొన్ని సంస్థల నుంచి వివరాలు సేకరించారు. సనత్‌నగర్‌, బొల్లారంలోని సంస్థ కార్యాలయాలతోపాటు ఆ సంస్థ యాజమాన్యానికి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపులో వ్యత్యాసం ఉండటంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఐటీ అధికారులు వెల్లడించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని