47వేల కేసులు..200పైబడ్డ మృతులు
close

తాజా వార్తలు

Updated : 22/03/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

47వేల కేసులు..200పైబడ్డ మృతులు

30వేల పైచిలుకు కేసులు మహారాష్ట్రలోనే

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది. రోజూవారీ కేసులు 50వేలకు చేరువవుతుండగా.. మరణాలు 200కు పైబడ్డాయి. ఆదివారం 8,80,655 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..46,951 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశంలో నవంబర్‌ ప్రారంభం నాటి విజృంభణ కనిపిస్తోంది. ఈ మహ్మమారి కారణంగా తాజాగా 212 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 1,16,46,081 కోట్ల మంది వైరస్ బారినపడగా.. 1,59,967 మంది మృత్యుఒడికి చేరుకున్నారని సోమవారం కేంద్రం వెల్లడించింది. 

కరోనా కొత్త కేసుల కారణంగా క్రియాశీల రేటు పెరుగుతోంది. నిన్నటి వరకు 3,34,646 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.66 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 21,180 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసుల్లో రికవరీలు సగం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకలిగిస్తోంది. ఇప్పటి వరకు 1.11 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా.. రికవరీ రేటు 95.96 శాతానికి తగ్గింది.  

మహారాష్ట్రను పీడిస్తోన్న మహమ్మారి..

మహారాష్ట్ర కరోనా మహమ్మారి గుప్పిట చిక్కుకుపోయింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 30,535 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 46,951గా ఉండగా.. ఒక్క ఆ రాష్ట్రంలోనే 30వేల పై చిలుకు కేసులు బయటపడ్డాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24లక్షల మార్కును దాటింది. తాజాగా 99 మంది మృత్యుఒడికి చేరగా..నిన్నటి వరకు 53,399 మంది ప్రాణాలు వదిలారు. అక్కడ 22,14,867 రికవరీలు.. 2,11,416 క్రియాశీల కేసులున్నాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో 3,779 మంది వైరస్ బారినపడ్డారు. 

4.50కోట్ల మందికి టీకాలు..

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీకా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. మార్చి 21న 4,62,157 మంది టీకాలు వేయించుకున్నారు. దాంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 4,50,65,998కి చేరుకుంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని