భారత్‌లో నాయకత్వ లేమిని కొవిడ్‌ చూపింది..!
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో నాయకత్వ లేమిని కొవిడ్‌ చూపింది..!

 మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో నాయకత్వలేమి, ముందు చూపు కొరత, తొందరగా సంతృప్తి పడే లక్షణాలకు పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులే ఉదాహరణగా నిలిచాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఒక వేళ మనం అప్రమత్తంగా ఉంటే.. జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదని గ్రహించాలి.  ప్రపంచంలో మిగిలిన చోట్ల ఏం జరిగిందా అని ఎవరైనా దృష్టి పెడితే తెలిసేది. బ్రెజిల్‌నే ఉదాహరణకు తీసుకొంటే.. అక్కడ వైరస్‌ రెట్టింపు వ్యాప్తి శక్తితో వెనక్కువచ్చిందని గుర్తించేవాళ్లం. గతంలో మనం వైరస్‌ను జయించామని భావించాము. వైరస్‌ తట్టుకొనే శక్తి వచ్చిందని భ్రమించి మళ్లీ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తెరిచాము. ఆ రకంగా భ్రమించడమే ఇప్పుడు ముప్పుగా మారింది’’ అని వ్యాఖ్యానించారు. తొలి తరంగాన్ని జయించినప్పుడు తగినంత సమయం లభించిందని ఎవరూ భావించకపోవడం టీకాలను అందుబాటులోకి తెచ్చే అంశం కూడా ఆలస్యమైందని రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు.

ఇక ఆర్‌బీఐపై రాజన్‌ మాట్లాడుతూ..‘‘వీలైనంతగా అకామిడేటీవ్ వ్యూహాన్ని అవలంబించాలి.  అది ఒత్తిడిలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థపై సందేహాలు తలెత్తుతున్నా.. విదేశీ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్‌బీఐ వద్ద భారీ విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని