Corona: ఒక్కరోజే 4187 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఒక్కరోజే 4187 మంది మృతి

దిల్లీ: దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఇక వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదవడం మహమ్మారి ఉద్దృతికి అద్దం పడుతోంది.

* శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది.

* ఇదే సమయంలో 4187 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,38,270 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.

* అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.95శాతంగా ఉంది.

* ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 37లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.96 శాతంగా ఉంది.

* దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం 22,97,257 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 16.73కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని