close

తాజా వార్తలు

Published : 23/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు!

జంతువుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయంటున్న ప్రెమాస్‌ బయోటెక్‌

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌లు మాత్రమే అందుబాటులోకి రాగా... ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌పైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యింది. తాజాగా నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ కోసం భారత్‌కు చెందిన మరో సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

భారత్‌కు చెందిన ప్రెమాస్‌ బయోటెక్‌ సంస్థ నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు ముమ్మరం చేసింది. క్యాప్సుల్‌ రూపంలో ఉండే ఈ వ్యాక్సిన్‌ను సింగిల్‌ డోసులో తీసుకునే విధంగా విదేశీ సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రెమాస్‌ బయోటెక్‌ ఈ మధ్యే ప్రకటించింది. ‘ఒరావాక్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ వ్యాక్సిన్‌పై జంతువుల్లో జరిపిన అధ్యయనంలో సమర్థంగానే పనిచేస్తున్నట్లు తేలిందని ప్రెమాస్‌ పేర్కొంది. వైరస్‌ను తటస్థీకరించే యాంటీబాడీలను ఉత్పత్తిచేయడంతో పాటు రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలను ఈ వ్యాక్సిన్‌ కలిగి ఉన్నట్లు తెలిపింది. తదుపరి ప్రయోగాలకు అనుమతి లభిస్తే రాబోయే రెండు, మూడు నెలల్లోనే క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభిస్తామని ప్రెమాస్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఔషధ రూపంలో ఉండే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే, పంపిణీ తేలిక కావడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు సులువుగా అందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీతో కలిసి భారత్ బయోటెక్‌ పనిచేస్తోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని