WTC Finals: బుమ్రా వికెట్లు తీస్తే గెలుస్తాం
close

తాజా వార్తలు

Published : 12/05/2021 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Finals: బుమ్రా వికెట్లు తీస్తే గెలుస్తాం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పైనల్స్‌ను టీమ్‌ఇండియా గెలవడంలో పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఫామ్‌ ఎంతో కీలకమని మాజీ సెలక్టర్‌ సాబా కరీమ్‌ అన్నాడు. తక్కువ సమయంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగాడని ప్రశంసించాడు. ఫిట్‌గా ఉండాలన్న ఒత్తిడి అతడిపై ఉంటోందని పేర్కొన్నాడు.

‘ఐపీఎల్‌లో గత 3-4 మ్యాచుల్లో బుమ్రా ఫామ్‌ను చూశాం. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతడు మంచి ఫామ్‌ కనబరిస్తే మన గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి. భారత జట్టులో బుమ్రా కీలక పేసర్‌. అతడు మూడు ఫార్మాట్లలో జట్టుకు ఆడుతున్నాడు. అందుకే ఎప్పుడూ ఫిట్‌ ఉండాలన్న, మెరుగ్గా ఆడాలన్న ఒత్తిడి అతడిపై ఉంటుంది. టెస్టుల్లో అతనెప్పడూ బాగా ఆడతాడు. అతడో భిన్నమైన పేసర్‌. ఆడటం కష్టం’ అని సబా కరీమ్‌ అన్నాడు.

‘అంతేకాకుండా బుమ్రా బౌలింగ్‌లో చాలా వేగం ఉంటుంది. చక్కని షార్ట్‌పిచ్‌ బంతులు విసురుతాడు. మెల్లమెల్లగా అంతర్జాతీయ క్రికెట్లో బుమ్రా ఆధిపత్యం పెరుగుతోంది’ అని కరీమ్‌ పేర్కొన్నాడు. నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌లో
బుమ్రా మోస్తరు ప్రదర్శన చేశాడు. అయితే, ఆస్ట్రేలియా సిరీసు తర్వాత అతడు వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని