కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు
close

తాజా వార్తలు

Updated : 29/01/2021 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు

ప్రకటించిన విమానయాన సంస్థ

దిల్లీ: కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ శుక్రవారం ప్రకటించింది. రీజినల్‌ కనెక్టివిటీ పథకం (ఉడాన్‌) లో భాగంగా మార్చి 28 నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పీటీఐ వెల్లడించింది. ‘‘దక్షిణ భారతదేశంలో రీజినల్‌ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని మేం భావిస్తున్నాం’’ అని ఇండిగో ప్రధాన స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్‌కుమార్ తెలిపారు.

కొత్తగా ప్రారంభించే బెంగళూరు - కర్నూలు, విశాఖపట్నం - కర్నూలు, చెన్నై - కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులుంటాయని ఆ సంస్థ ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్‌ కనెక్టివిటీ కోసం ఉడాన్‌ పథకం ప్రారంభించారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కేంద్రం 2017లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇవీ చదవండి..

2020లో 4-5 మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టాం

రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని