పింక్‌ టెస్టు: 13 వికెట్లతో కొత్త రికార్డు 
close

తాజా వార్తలు

Updated : 25/02/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పింక్‌ టెస్టు: 13 వికెట్లతో కొత్త రికార్డు 

మొతేరా స్టేడియంలో భారత్‌ X ఇంగ్లాండ్‌ తొలి రోజు ఆటలో..

(ఫొటో: బీసీసీఐ ట్విటర్‌)

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంగా ఇటీవలే అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసిన నరేంద్రమోదీ స్టేడియంలో బుధవారం టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమైన తొలిరోజే అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. భారత్‌ X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఈ పింక్‌బాల్‌ టెస్టులో తొలి రోజు మొత్తం 13 వికెట్లు పడగా, 211 పరుగులు నమోదయ్యాయి. అయితే, పింక్‌ బాల్‌ టెస్టుల్లో తొలి రోజు అత్యధిక వికెట్లు పడటం ఇది నాలుగోసారి కాగా, తక్కువ మొత్తం స్కోర్‌ నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో అహ్మదాబాద్‌ మైదానం ప్రారంభమైన తొలి రోజే కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ భారీ స్కోర్‌ సాధించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను భారత స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్‌ తొలి వికెట్‌ తీసి దెబ్బకొట్టగా.. తర్వాత అక్షర్‌ 6/38, అశ్విన్‌ 3/26 చెలరేగిపోయారు. దాంతో ఇంగ్లాండ్‌ 112 పరుగులకే ఆలౌటైంది. ఆపై భారత్‌ సైతం స్పిన్‌ పిచ్‌పై తడబడింది. 99 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో తొలిరోజు మొత్తం 13 వికెట్లు.. 211(రెండు జట్ల స్కోర్‌) పరుగులు నమోదయ్యాయి. మరోవైపు భారత్‌లో ఇంగ్లీష్‌ జట్టుకు ఒక టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇదే తక్కువ స్కోరు కావడం గమనార్హం.

గతంలో పింక్‌బాల్‌ టెస్టుల్లో 13 వికెట్లకు నమోదైన స్కోర్ల వివరాలు..

* 13/211 : ఇంగ్లాండ్‌ X భారత్‌ అహ్మదాబాద్‌ టెస్టు 2021
* 13/233: ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌ టెస్టు 2018
* 13/280: బంగ్లాదేశ్‌ X భారత్‌ కోల్‌కతా టెస్టు 2019
* 13/339 : దక్షిణాఫ్రికా X జింబాబ్వే పోర్ట్‌ ఎలిజబెత్‌ టెస్టు 2017


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని