close

తాజా వార్తలు

Published : 27/01/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దివ్యాంగుల భద్రతకు భరోసానిస్తూ...

ఉపకరణాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం
దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్‌తో ముఖాముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్‌ శైలజ పేర్కొన్నారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా ఈసారి పెద్దఎత్తున ఉపకరణాలు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వికలాంగులు ఫిబ్రవరి 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందన్న శైలజతో ముఖాముఖి..

దివ్యాంగుల కోసం గతంలో పలు యంత్రాలు పంపిణీ చేశారు. ఈసారి మళ్లీ ఎలాంటి పరికరాలు అందజేయబోతున్నారు?
శైలజ: దివ్యాంగుల కోసం అనేక రకాల యంత్రాలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రిట్రోఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వాహనాలు, బ్యాటరీతో నడిచే వీల్‌ చైర్లు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, ల్యాప్‌ట్యాప్‌లతోపాటు పలు పరికరాలను ఉచితంగా అందజేయనున్నాం. దాదాపు రూ.లక్ష విలువ చేసే రిట్రోఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వాహనాన్ని తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు అందజేస్తోంది. ఇలా చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మనదే.

ఈసారి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు? ఎంత ఖర్చు చేసి వాటిని పంపిణీ చేయబోతున్నారు?
శైలజ: గతంలో 500 వరకు రిట్రోఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ వాహనాలను పంపిణీ చేశాం. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నాం. దాదాపు 1000 వాహనాలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇతర పరికరాల సంఖ్యను కూడా పెంచబోతున్నాం. ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధుల చేత ఈ పరికరాలను అందజేయబోతున్నాం. ఇందుకోసం రూ.20 కోట్లను వెచ్చిస్తున్నాం. పారదర్శకత కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఓ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది.

కేవలం పరికరాలను మాత్రమే అందజేస్తున్నారా? లేదా వారు ఎదిగేందుకు ఆర్థికసాయం ఏమైనా చేస్తున్నారా?
శైలజ: ఆర్థిక సబ్సిడీ కింద దాదాపు 800 మందికి లబ్ధి చేకూర్చే విధంగా రూ.5 కోట్లు అందజేస్తున్నాం. రూ.50 వేలను మాత్రం బ్యాంకుతో సంబంధం లేకుండా అందజేస్తున్నాం. రూ.లక్ష, 2 లక్షలు, 3 లక్షలను మాత్రం బ్యాంకుకు లింక్‌ చేసి అందజేస్తున్నాం.

 

ఇవీ చదవండి...

50 శాతం ధరకే దేశీయ రోబోలు

నాలుగు భాషలు.. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్‌లో..
Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని