IPLతో పోలికా? ఈ పాక్‌ పేసర్‌ మాటేంటంటే!
close

తాజా వార్తలు

Published : 15/05/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPLతో పోలికా? ఈ పాక్‌ పేసర్‌ మాటేంటంటే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సాటి రాగల క్రికెట్‌ లీగ్ మరొకటి లేదని పాకిస్థాన్‌ పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ అన్నాడు.  అది ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్‌ లీగ్‌ అని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌తో దానికి పోలికే లేదని తెలిపాడు.  నాణ్యమైన బౌలింగ్‌కు మాత్రం పీఎస్‌ఎల్‌ చిరునామాగా వర్ణించాడు.

ప్రపంచంలో ముందుగా మొదలైన క్రికెట్‌ లీగ్ ఐపీఎల్‌. ఎంతోమంది మేటి క్రికెటర్లు ఇందులో భాగం అయ్యారు. కెవిన్‌ పీటర్సన్‌, సనత్‌ జయసూర్య, కుమార సంగక్కర, బ్రెట్‌ లీ, రికీ పాంటింగ్‌, ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌ సహా అలనాటి క్రికెట్‌ హీరోలు ఈ లీగ్‌ ఆడారు. ప్రస్తుత టాప్‌ ఆటగాళ్లు సైతం ఆడుతూ కోట్లు ఆర్జిస్తున్నారు. లీగులో ఆడిన కుర్రాళ్లు అంతర్జాతీయంగా అదరగొడుతున్నారు.

‘అంతర్జాతీయంగా అత్యుత్తమ క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడతారు. అందుకే పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చకూడదు. ఐపీఎల్‌ది మరో స్థాయి. వారి అంకితభావం, నిర్వహణ సామర్థ్యం, కమ్యూనికేషన్స్‌, ఆటగాళ్ల ముసాయిదా, ఆటగాళ్ల ఎంపిక అంతా భిన్నంగా ఉంటుంది. అందుకే దాంతో ఏ లీగ్‌ పోటీపడలేదని నా ఉద్దేశం. ఐపీఎల్‌ తర్వాత స్థానం మాత్రం పీఎస్‌ఎల్‌దే. ఇప్పటికే దానిని నిరూపించుకుంది’ అని రియాజ్‌ అన్నాడు.

పీఎస్‌ఎల్‌ బౌలింగ్‌ ప్రమాణాలు మాత్రం అత్యుత్తమంగా ఉంటాయని రియాజ్‌ తెలిపాడు. ‘పీఎస్‌ఎల్‌ బౌలింగ్‌ నాణ్యత చాలా ఎక్కువ. ఇందులో ఆడే బౌలర్లు మరే లీగులోనూ కనిపించరు. ఐపీఎల్‌లోనూ ఉండరు. అందుకే పాక్‌ లీగులో భారీ స్కోర్ల మ్యాచులు చూడలేం. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్‌ దాడులు పీఎస్‌ఎల్‌లో ఉంటాయి’ అని అతడు పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని