వ్యాక్సిన్‌ తీసుకుంటే.. బీర్‌ ఫ్రీ
close

తాజా వార్తలు

Updated : 20/02/2021 05:50 IST

వ్యాక్సిన్‌ తీసుకుంటే.. బీర్‌ ఫ్రీ

వ్యాక్సిన్‌ పంపిణీకి ఇజ్రాయెల్‌ వినూత్న మార్గాలు

జెరూసలేం: డిసెంబరు 20న కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించిన ఇజ్రాయెల్‌ మెరుపువేగంతో దూసుకెళ్తోంది. 93లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 47శాతం మంది ఫైజర్‌ టీకా తొలి డోసును, 31శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. దేశంలోని 70 ఏళ్లకు పైబడిన వారిలో 90శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని వారు తెలిపారు. వ్యాక్సిన్‌ మంచి ఫలితాలనిస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగా టెల్‌ అవివ్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జెనియా గ్యాస్ట్రో పబ్‌లో ఒక ప్రత్యేక ఆఫర్‌ను పెట్టారు. మొదటి,రెండు వ్యాక్సిన్‌ డోసును తీసుకున్న వారికి ఒక బీర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. వ్యాక్సిన్‌ నిబంధనల మేరకు ఆల్కహాల్‌ లేని డ్రింకులను అందిస్తున్నట్లు ఆ పబ్ నిర్వాహకులు తెలిపారు. ‘‘వ్యాక్సిన్‌ తీసుకొనే చోటుకు మనం వెళ్లలేకపోయినపుడు, మనం వెళ్లే చోటుకే వ్యాక్సిన్‌ను తీసుకురావడమన్నది మంచి ఆలోచన’’ అని ఆ పబ్‌లో వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న మే పెరేజ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని