ఆ మరణాలు మారణహోమం కంటే తక్కువేమీ కాదు!
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మరణాలు మారణహోమం కంటే తక్కువేమీ కాదు!

ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై అలహాబాద్‌ హైకోర్టు

లఖ్‌నవూ: ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా మరణాలు సంభవిస్తున్న ఘటనలపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.  ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా కొవిడ్‌ రోగులు మరణించడం ఒక ‘నేరపూరిత చర్య అని, మారణహోమం కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించింది. లఖ్‌నవూ, మేరఠ్‌ జిల్లాల్లో పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందక మరణాలు సంభవించాయన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ మేరకు కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే ఆయా జిల్లాల్లో సంభవించిన ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది.

‘‘ఆక్సిజన్‌ సరఫరా లేక కొవిడ్‌ బాధితులు మరణిస్తుండడం మమ్మల్ని కలచివేస్తోంది. ఇది ఒక నేరపూరిత చర్య. నిరంతరాయంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సమకూర్చుకొని, అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కలిగిన అధికారుల వైఖరి మారణహోమం కంటే తక్కువేమీ కాదు. శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెంది గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌, మెదడు శస్త్రచికిత్సలు సైతం జరుగుతున్న ఈ కాలంలో ప్రజలు ఈ విధంగా మరణించడం ఎంత వరకు సమంజసం. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని మా దృష్టికి వచ్చింది. ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు సైతం వాటిని ధ్రువీకరిస్తున్నారు. అందుకు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించి దర్యాప్తునకు ఆదేశిస్తున్నాం’’ అని కేసు విచారించిన జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్‌ అజిత్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. మేరఠ్‌, లఖ్‌నవూలో ఈ ఘటనలపై వెంటనే విచారణ జరిపి 48 గంటల్లోగా నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లను కోర్టు ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని