Jagame Thandhiram 190 దేశాలు.. 17 భాషల్లో విడుదల
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:26 IST

Jagame Thandhiram 190 దేశాలు.. 17 భాషల్లో విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ స్టార్‌ ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జగమేతంతిరం’. జూన్‌ 18 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే..  డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై రికార్డు స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. 190 దేశాల్లో 17భాషల్లో ఈ చిత్రం అలరించనుంది. తమిళం, కన్నడ, మలయాళంతో పాటు తెలుగులోనూ ప్రసారం కానుంది. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే.. కరోనా నేపథ్యంలో ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ధనుష్‌ ఒక గ్యాంగ్‌స్టర్‌లా కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్‌ కాస్మో, జోజు జార్జ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని