
తాజా వార్తలు
తిరుపతిలో జనసేన పీఏసీ భేటీ
తిరుపతి: చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశమైంది. ఈ భేటీలో పవన్ పాల్గొన్నారు. ఉప ఎన్నిక దృష్ట్యా అభ్యర్థి ఎంపికపై పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సహా ఇతర నేతలతో ఆయన చర్చిస్తున్నారు.
అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తిరుపతి వెళ్లే మార్గంలో దారిపొడవునా అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
ఇవీ చదవండి..
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
‘పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే స్వీప్ చేస్తాం’
Tags :