close

తాజా వార్తలు

Published : 02/01/2021 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరావతికి మద్దతు తెలపాలి:జేసీ

తాడిపత్రి: రాజకీయ ప్రముఖులంతా అమరావతి రైతుల దీక్షలకు మద్దతు తెలపాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దిల్లీలో రైతుల నెల రోజుల దీక్షకే నాలుగుసార్లు కేంద్రం చర్చలకు పిలిచిందని ఆయన అన్నారు. ఏడాదికి పైగా దీక్షలు చేస్తున్న అమరావతి రైతులను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తమపై బనాయించిన అక్రమ కేసులకు సంబంధించి ఈ నెల 4న తాడిపత్రిలో ఆందోళనకు దిగుతామని దివాకర్‌రెడ్డి ప్రకటించారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు ఏడాదిగా పైగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

రామతీర్థంలో రాజకీయ వేడి 
 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని