close

తాజా వార్తలు

Updated : 08/03/2021 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేఈఈ మెయిన్‌ 2021 ఫలితాలు విడుదల

న్యూదిల్లీ: జేఈఈ మెయిన్‌-2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) సోమవారం రాత్రి ప్రకటించింది. తొలి విడతలో దేశ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు 100శాతం పర్సంటైల్‌ సాధించగా.. పలు విభాగాల్లో తెలుగు విద్యార్థులూ సత్తా చాటారు. ఏపీకి చెందిన పి.చేతన్‌, మనోజ్ఞ సాయి, తెలంగాణకు చెందిన చల్లా విశ్వనాథ్‌, బాలికల విభాగంలో కొమ్మ శరణ్య 99.99 శాతం మార్కులు సాధించారు. ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో ఏపీకి చెందిన ఏవీ జయ చైతన్య, ఓబీసీ విభాగంలో తెలంగాణ విద్యార్థి టి.వి.మణికంఠ తమ ప్రతిభను చూపారు. ఎస్టీ కేటగిరిలో తెలంగాణకు చెందిన ఐ.నితిన్‌, బి.పి.వర్మ, ఎన్‌.ప్రీతమ్‌ ఉత్తమ మార్కులు సాధించారు. దివ్యాంగుల విభాగంలో ఏపీకి చెందిన ఎం.ఎస్‌.ప్రణవ్‌ మూడో ర్యాంకు, సాయికృష్ణ నాలుగో ర్యాంకు సాధించారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌-2021కు హాజరు కాగా.. ఇందులో 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లోనే లక్షన్నర మంది ఉండటం విశేషం. 

జేఈఈ 2021 మెయిన్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని