‘జాస్మిన్’‌గా వచ్చి ఆటపట్టించిన జిల్‌ బైడెన్
close

తాజా వార్తలు

Published : 03/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాస్మిన్’‌గా వచ్చి ఆటపట్టించిన జిల్‌ బైడెన్

వాషింగ్టన్: ఏప్రిల్ ఫూల్స్‌ డేన అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్ తన సిబ్బందిని సరదాగా ఆటపట్టించారు. విమానంలో కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్‌కు వచ్చిన గ్యాప్‌లో తన సిబ్బందిని మాయ చేసి, నవ్వించారు. 

తలకు నల్లని విగ్గు, ముఖానికి నల్లని ఫేస్ మాస్క్‌, జాస్మిన్ అనే ఫ్లైట్ అటెండెంట్‌గా వచ్చి.. విమానంలో సిబ్బందికి మీల్ సర్వ్‌ చేశారు. మారు వేషంలో క్యాబిన్లను దాటుకుంటూ వెళ్లిన ఆమెను తన స్టాఫ్, నిఘా, మీడియా సిబ్బంది ఎవరు కూడా గుర్తించలేదు. ఐదు నిమిషాల తరవాత తిరిగి, మీడియా సిబ్బంది దగ్గరకు వచ్చి విగ్‌ తీసేస్తూ.. ‘ఏప్రిల్‌ ఫూల్స్’ అంటూ ఆటపట్టించారు. అరే, గుర్తుపట్టలేకపోయామే అనుకుంటూ.. ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైది. ఏప్రిల్ ఫూల్స్‌ డేన ఇలా ప్రాంక్స్ చేసి ఆటపట్టించడం జిల్‌కు కొత్తేంకాదు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె తోటివారిని ఫూల్స్ చేసిన సందర్భాలున్నాయి. కాలిఫోర్నియాలో జిల్‌ బైడెన్ టీకా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు, రైతులను కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ.. ఆమె సిబ్బందితో సరదాగా గడిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని