close

తాజా వార్తలు

Published : 06/08/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిన్నారిని హతమార్చిన నిందితుడికి ఉరిశిక్ష

విజయవాడ: ఏపీలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్‌  కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ప్రకాష్‌కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పు చెప్పారు.

వివరాల్లోకి వెళితే... 2019 నవంబర్‌ 10న విజయవాడ గొల్లపూడిలోని ఇంటి వద్ద ఆడుకుంటున్న ద్వారక అనే చిన్నారిని అపహరించిన నిందితుడు అనంతరం హత్య చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రకాష్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో 35 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ప్రకాష్‌ బాలికను హత్యచేసినట్లు నేరం రుజువు కావడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నారాయణరెడ్డి తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన