
తాజా వార్తలు
నా ఫిర్యాదులో పేర్లు మార్చేశారు: అపరాజిత
ప్రొద్దుటూరు: కడప జిల్లాలో తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య హత్యకేసులో పోలీసుల తీరుపై సుబ్బయ్య భార్య అపరాజిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్లను పోలీసులు మార్చారని ఆరోపించారు. తన భర్త మొబైల్ ఫోన్ ఎక్కడుందో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తేనే తన భర్త వెళ్లాడని ఆమె తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి..
నా భర్త హత్య వెనుక ఎమ్మెల్యే: అపరాజిత
Tags :