
తాజా వార్తలు
కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ ఎప్పుడంటే?
ఇంటర్నెట్ డెస్క్: నటి కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్‌సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’. తమిళంలో నిర్మితమవుతున్న ఈ సిరీస్‌ను క్రేజీ డైరెక్టర్ వెంకట్‌ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ప్రసారం కానుందని సదరు ఓటీటీ సంస్థ తెలిపింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజల్‌కు ఇదే తొలి వెబ్‌సిరీస్ కావడం విశేషం. ఇదే విషయాన్ని తెలుపుతూ కాజల్ తన ట్విటర్లో ‘లైవ్ టెలికాస్ట్’ పోస్టర్‌ను ఉంచింది. అందులో ఒకవైపు కాజల్ ‘డెవిల్’కళ్లతో భయపెడుతూ, మరోవైపు వైభవ్, ఆనందితో కలిసి భయపడుతుంటుంది. లుక్ చూస్తుంటేనే కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెట్టేలా ఉన్నారు!
ఇవీ చదవండి!
పవన్-మహేశ్ మొదలు పెట్టేశారు..!
చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు