close
Array ( ) 1

తాజా వార్తలు

సీక్వెల్‌లోనూ కాజల్‌నే తీసుకుంటున్నారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇళయ దళపతి విజయ్‌ కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘తుపాకి’. స్లీపర్‌ సెల్స్‌ నేపథ్యంగా సాగే ఈ చిత్రం అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్‌ యాక్షన్‌తో పాటు, కాజల్‌తో ఆయన చేసిన సందడి అలరించింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘తుపాకి-2’ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు మురుగదాస్‌. కథానాయకుడిగా విజయ్‌నే తీసుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా కథానాయికగా మళ్లీ కాజల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తొలి భాగంలో స్లీపర్‌ సెల్స్‌ను నాశనం చేసిన కథానాయకుడు సీక్వెల్‌లో దేనిపై పోరాటం సాగిస్తాడో చూడాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.