‘ఉరి కొయ్యపై ఏపీ ఆర్థిక పరిస్థితి’
close

తాజా వార్తలు

Published : 06/04/2021 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉరి కొయ్యపై ఏపీ ఆర్థిక పరిస్థితి’

మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఉరి కొయ్యపై ఉందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేతల కాలువ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఆదాయం పెరిగినా రాష్ట్రాన్ని అప్పుల పాల్జేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర పరిస్థితిపై మేధావులు ప్రజలను చైతన్యపరచాలని కోరారు. రాష్ట్ర అర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి ఉపఎన్నికలో 2లక్షల నకిలీ ఓటరు కార్డులు సృష్టించారని కాలువ శ్రీనివాసులు ఆరోపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని