దక్షిణ కోయంబత్తూర్ బరిలో కమల్‌ 
close

తాజా వార్తలు

Updated : 12/03/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణ కోయంబత్తూర్ బరిలో కమల్‌ 

చెన్నై: తమిళనాట ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ వరుసగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. తాజాగా మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌.. ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఇందులో ఆయన పేరు కూడా ఉంది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కమల్‌.. దక్షిణ కోయంబత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. ‘నేను ఐఏఎస్‌ అధికారిని కావాలని, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని మా నాన్న కలలు కనేవారు. కానీ నేను ఐఏఎస్‌ కాలేకపోయాను. అయితే మా పార్టీలో ఎంతో మంది సివిల్‌ సర్వీస్‌ మాజీ అధికారులు ఉండటం గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి అన్నాడీఎంకే నేత అమ్మన్‌ కే అర్జునన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

234 శాసనసభ స్థానాలున్న తమిళనాడుకు ఏప్రిల్‌ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో తొలిసారిగా బరిలోకి దిగుతున్న మక్కల్‌ నీది మయ్యం.. శరత్‌కుమార్‌ పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నారు. మిగతా చోట్ల వీరు అభ్యర్థులను నిలబెట్టలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని