Cinemanews: కంగనకు కొత్త చిక్కులు
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:19 IST

Cinemanews: కంగనకు కొత్త చిక్కులు

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సోషల్‌ మీడియాలో తన గొంతుకను వినిపిస్తూ వస్తున్న ఆమెకు ఇప్పుడదే సమస్య తెచ్చింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ వ్యవహారంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆమె సోషల్‌ మీడియా వేదికగా గతంలో తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఆమెపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆమె పాస్‌పోర్టు గడువు సెప్టెంబర్‌ 15న ముగియనుంది. దీంతో పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు అధికారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఆమె ముంబయి హైకోర్టను ఆశ్రయించింది.

కంగన తన తర్వాతి చిత్రం ‘తేజస్‌’ కోసం హంగేరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ నెల 15నుంచి ఆగస్టు 30 వరకు అక్కడ చిత్రీకరణ షెడ్యూల్‌ వేశారు. ఈ క్రమంలోనే ఆమె ముంబయిలోని పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లింది. రెన్యువల్‌ ప్రక్రియ పూర్తి చేయాలంటే పోలీస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి. అయితే.. బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదై ఉండటంతో అధికారులు పాస్‌పోర్టు పునరుద్ధరణకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ బాలీవుడ్‌ నటి ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. సినిమా చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉన్నందున పాస్‌పోర్టు పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అయితే.. కంగన చేసిన దరఖాస్తు అస్పష్టంగా ఉందని చెప్పిన హైకోర్టు.. ఆమె కేసును జూన్‌ 25కు వాయిదా వేసింది. ఇన్నాళ్లు ఆమె కోర్టును ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాను కూడా పార్టీగా చేర్చాలని కోర్టు కోరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని