close

తాజా వార్తలు

Published : 13/02/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిరసనల వల్ల నటికి భద్రత పెంపు

అభిప్రాయాలు చెబితే ఇలా చేస్తారా: క్వీన్‌

ముంబయి: తన వ్యక్తిగత భద్రత పెరిగిందని బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ తెలిపారు. దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా ఇటీవల కంగన పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు అసలు రైతులే కాదని.. ఉగ్రవాదులని పేర్కొంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కథానాయికగా నటిస్తోన్న ‘ధకాడ్‌’ చిత్రీకరణకు నిరసన సెగ తాకింది. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా షూట్‌ మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సినిమా సెట్‌ వద్ద ఆందోళనలు చేశారు. దీంతో తనకి పోలీసుల భద్రత పెరిగిందని ఆమె ట్విటర్‌ వేదికగా తెలిపారు.

‘‘ధకాడ్‌’ షూట్‌ జరుగుతోన్న లొకేషన్‌ వద్ద కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాకు భద్రతను పెంచారు. ఆందోళనకారుల్ని అక్కడి నుంచి పంపించి వేశారు. అభిప్రాయాలను బహిర్గతం చేసేవారిపై ఈ విధంగా దాడికి పాల్పడతారా?’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి

పాట కోసం దుస్తులు తొలగించమన్నారు

వరుసగా పదో రాత్రి కూడా...




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని