close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 11/03/2020 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మరి ఎన్నికలెందుకు.? నామినేట్‌ చేసుకోండి’

అమరావతి: రాష్ట్రం బిహార్‌ను తలపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బిహార్‌లో కూడా ఇన్ని అక్రమాలు, అఘాయిత్యాలు జరిగాయని అనుకోవడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పులిచర్లలో భాజపా నాయకులపై వైకాపా దాడిని ఆయన ఖండించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ప్రశాంత జీవనం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. దౌర్జన్యం, దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వైకాపానుద్దేశించి కన్నా విమర్శించారు. ఎన్నికల్లో గెలవకపోతే ఎమ్మెల్యేల అంతు చూస్తామని బెదిరించారని, దీంతో ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వైకాపాకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు తొలగిస్తామని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను బెదిరిస్తున్నారని కన్నా అన్నారు. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య జరిగితే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేక సీబీఐ విచారణకు అడిగారని.. ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు అవమానం ఉందా? అని ప్రశ్నించారు. గతంలో సీబీఐ విచారణ అడిగిన జగన్‌ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. డేటా చోరీ విషయంలో నానా గోల చేసిన జగన్.. ఆ కేసును ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, స్థానిక ఎన్నికల్లో కనీసం నామినేషన్లు వేయనీయడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నుంచి నిలబడే వ్యక్తులను, వారి కుటుంబ సభ్యులను సైతం బెదిరిస్తున్నారని చెప్పారు. అంత దానికి ఎన్నికలు ఎందుకు? నామినేట్‌ చేసుకుంటే సరిపోయేది కదా? అని కన్నా అన్నారు.  పోటీ చేసే అభ్యర్థులపై దాడులు... వైకాపా కాని వారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో నిర్లక్ష్యం.. తప్పుడు కేసులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం.. ఇవన్నీ చూస్తుంటే అధికార పార్టీ అభద్రతా భావం బయటపడుతోందని అంతకుముందు ట్విటర్‌లో ఆక్షేపించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.