సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా కర్ణాటక!
close

తాజా వార్తలు

Published : 05/05/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా కర్ణాటక!

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌ 27 రాత్రి నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ పాక్షిక లాక్‌డౌన్‌ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. కాగా మే 12 నాటికి పరిస్థితులను సమీక్షించి కేసులు ఇలాగే కొనసాగితే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని యడియూరప్ప ప్రభుత్వం యోచిస్తోంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కోరలు చాస్తోంది. మంగళవారం 40,128 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో 22,112 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 55 శాతంగా నమోదైంది. గత వారం బెంగళూరులో పాజిటివిటీ రేటు 12 శాతంగా ఉండగా అది ఒక్క వారంలోనే 55 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 3 లక్షలకుపైగానే యాక్టిక్‌ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో మంగళవారం కొత్తగా 44,631 కరోనా కేసులు నమోదవగా 288 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని