అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్‌ కలకలం
close

తాజా వార్తలు

Updated : 23/01/2021 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌: కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామీజీ అపహరణకు గురికావడం కలకలం రేపింది. బార్లీ జిల్లా కపిలాపూర్‌లో స్వామీజీని దుండగులు కిడ్నాప్‌ చేశారు. విమానంలో షిర్డీ వెళ్దామని ఆ వ్యక్తులు స్వామీజిని నమ్మించి అపహరించారు. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డి, సతీశ్‌ అనే వ్యక్తులు హైదరాబాద్‌ తీసుకొచ్చినట్లు స్వామీజి ఆరోపిస్తున్నారు. శంషాబాద్‌ మీదుగా తనను బెంగళూరు తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు. అక్కడ గదిలో బంధించి డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులు చిత్రహింసలకు గురిచేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రూ. 5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో వారు తిరిగి హైదరాబాద్‌ తీసుకొచ్చారని వివరించారు.ఈ వ్యవహారంపై లంగర్‌హౌస్‌ పోలీసులకు స్వామీజీ ఫిర్యాదు చేశారు. దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేయకుండానే వదిలేశారని ఆయన ఆరోపించారు. కిడ్నాప్‌ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు స్వామీజీ ముందుకు రాలేదని లంగర్‌హౌస్‌ సీఐ వెల్లడించారు. అపహరించిన వారు తన భక్తులేనని, వదిలేయాలని స్వామీజీ కోరినట్లు సీఐ వివరించారు. 

ఇవీ చదవండి..
పోలీసులకు చిక్కిన హోసూరు దోపిడీ ముఠా

పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని