close

తాజా వార్తలు

Updated : 31/12/2020 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ తీర్మానం

36వ రోజుకు రైతుల ఆందోళన 

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన గురువారంతో 36వ రోజుకు చేరుకుంది. దేశ రాజధాని శివార్లలోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద అన్నదాతలు బైఠాయించి ఆందోళన సాగిస్తున్నారు. బుధవారం కేంద్రం, రైతు సంఘాల మధ్య ఆరోవిడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదుగంటల పాటు జరిగిన చర్చల్లో కొద్దిపాటి పురోగతి కనిపించింది. చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో జనవరి 4న మరోసారి రైతు సోదరులతో సమావేశం కానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 

చట్టాల ఉపసంహరణకు కేరళలో తీర్మానం..
సెప్టెంబర్‌లో పార్లమెంట్ అత్యవసరంగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేరళ శాసనసభ ఈ రోజు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు ఆ రాష్ట్ర శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశమైంది. ‘వ్యవసాయ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం సేకరించి, అవసరమైన వారికి న్యాయమైన ధరలకు అందించాలి. దానికి బదులు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని కార్పొరేట్లకు స్వాధీనం చేసేలా ఈ చట్టాలు అనుమతిస్తున్నాయి. న్యాయపరమైన బాధ్యతను కేంద్రం విస్మరిస్తోంది. రైతుల ఈ నిరసన ఇలాగే కొనసాగితే.. కేరళపై తీవ్ర ప్రభావం పడనుంది. కేరళ వంటి వినియోగదారు రాష్ట్రానికి వ్యవసాయ ఉత్పత్తులు రావడం ఆగిపోతే, ప్రజలు ఆకలితో ఇబ్బంది పడతారు’ అంటూ తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.  

ఇవీ చదవండి:

చర్చల్లో ముందడుగు

 




Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని