కోళ్లమాంసపు వ్యర్థాలతో డీజిల్‌ తయారీ: పరిశోధించిన కేరళ పశు వైద్యులు

తాజా వార్తలు

Published : 27/07/2021 01:40 IST

కోళ్లమాంసపు వ్యర్థాలతో డీజిల్‌ తయారీ: పరిశోధించిన కేరళ పశు వైద్యులు

ఏడేళ్లు ఎదురుచూశాక దక్కిన పేటెంట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన పశువైద్యులు అబ్రహాం కోళ్లమాంసం వ్యర్థాలతో బయో డీజిల్‌ను ఉత్పత్తి చేయడం కనిపెట్టారు. దాదాపు ఏడేళ్ల నిరీక్షణ తర్వాత తన పరిశోధనకు గత జులై7న  పేటెంట్‌  పొందారు. ఆయన తయారు చేసే డీజిల్‌ ప్రస్తుతం మార్కెట్‌లో లభించేదానికంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకు లభించడమేకాక, వాయుకాలుష్యాన్ని సగానికి సగం తగ్గిస్తుందని తెలుస్తోంది. పైగా లీటర్‌కు 38 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది.  ప్రస్తుతం ఆయన కేరళ వెటర్నరీ, యానిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ పరిధిలోని పశువైద్య కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తమిళనాడు వెటర్నరీ, యానిమాల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ పరిధిలోని నమక్కల్ పశువైద్య కళాశాలలో తన పీహెచ్‌డీలో భాగంగా ఆయన ఈ పరిశోధన చేపట్టి, విజయం సాధించారు. 

పరిశోధన కొనసాగిందిలా..

2009-12  మధ్య కాలంలో వధ్యశాలలో లభించే బ్రాయిలర్‌ కోళ్లు, ఇతర పక్షుల వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ ఉత్పత్తి చేయడంపై ప్రొఫెసర్‌ రమేశ్‌ శరవణకుమార్‌ మార్గదర్శకత్వంలో జాన్‌ పరిశోధన చేశారు. తనకు గైడ్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ దీనిపై పేటెంట్‌కోసం, తమిళనాడు పశువైద్య విశ్వవిద్యాలయం తరఫున 2014లోనే దరఖాస్తు చేశారు. ఈ పరిశోధన తర్వాత వయనాడ్‌లోని కాల్పెట్టా వెటర్నరీ కాలేజీలో అబ్రహాం ఉద్యోగంలోకి చేరారు. 2014లో రూ.18 లక్షలతో అక్కడ కాలేజీ క్యాంపస్‌లో ప్రయోగాత్మకంగా ఓ పైలట్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. దీనికి ఐసీఏఆర్‌ ఆర్థిక సాయం అందించింది. ఆ తర్వాత భారత్‌ పెట్రోలియంకు
చెందిన కొచిన్‌ రీఫైనరీ ఏప్రిల్‌ 2015లో ఆయన తయారు చేసిన బయోడీజిల్‌ను పరీక్షించి క్వాలిటీ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అప్పటినుంచి కాలేజీకి చెందిన ఓ వాహనాన్ని ఈ ఇంధనంతోనే నడుపుతున్నారు. కోళ్ల మాంసపు వ్యర్థాలతోనే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నిస్తే, దానికాయన పక్షులు, పందుల వ్యర్థాల్లోంచి లభించే కొవ్వులో అధిక మోతాదులో గది ఉష్ణోగ్రత వద్దే నూనె లభిస్తుందని అన్నారు.

ఎక్కువ మైలేజీ.. తక్కువ కాలుష్యం! 

కోళ్ల వ్యర్థాల్లో 62 శాతం కొవ్వు ఉంటుంది.  ఆ కొవ్వులో శక్తికి మూలమైన సెటాన్‌ 72 శాతం ఉంటుంది. మామూలు డీజిల్‌లో ఇది 64 శాతమే ఉంటుంది.  పైగా ఈ బయోడీజిల్‌లో ఆక్సిజన్‌ శాతం ఎక్కువ ఉండటంతో ఇంజిన్‌ సామర్థ్యం కూడా 11 శాతం పెరుగుతుంది. దాంతో 72 శాతం పొగ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాదాపు అన్నిరకాల డీజిల్‌ ఇంజిన్లకు దీన్ని ఇంధనంగా వాడవచ్చు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని