ఇంగ్లాండ్‌ కోచ్‌ ఫిర్యాదు చేయొద్దు: పీటర్సన్‌
close

తాజా వార్తలు

Published : 02/03/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌ కోచ్‌ ఫిర్యాదు చేయొద్దు: పీటర్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పింక్‌బాల్‌ టెస్టు పిచ్‌పై ఇంగ్లాండ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఫిర్యాదు చేయాలని తలిస్తే అది మంచిదికాదని ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. సిల్వర్‌వుడ్‌ ఆ పిచ్‌ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేయాలనుకోవడం ముందే ఓటమిని అంగీకరించినట్లు అవుతుందని చెప్పాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో పీటర్సన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

‘ఎవరినైనా వేలెత్తి చూపితే, మిగిలిన నాలుగేళ్లు మనవైపే చూపుతాయి. ఇంగ్లాండ్‌ ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే మ్యాచ్‌లో నేనొక ఇంగ్లాండ్‌ ఆటగాడిని అయి ఉంటే.. బాగా ఆడలేదనే విషయాన్ని కచ్చితంగా చెప్పేవాడిని. తర్వాతి టెస్టుకు మరోవారం సమయం ఉండటంతో మరింత బాగా కష్టపడి ఆ మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తానని అనేవాడిని. ఎందుకంటే చివరి టెస్టు విజయం సాధించి, భారత్‌లో రెండు మ్యాచ్‌లు గెలుపొంది.. సిరీస్‌ డ్రా చేసుకోవడం మంచి విషయమే అవుతుంది’ అని పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్‌ కోచ్‌ ఇప్పుడు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా, ఓటమిని అంగీకరించే స్వభావం లేకుండా ఉండాలని పీటర్సన్‌ సూచించాడు. తమ ఓటమికి పిచ్‌ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేసి తర్వాతి మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై దృష్టి సారించాలన్నాడు. స్పిన్‌ బౌలింగ్‌కు ఎదుర్కోవడంలో ఇంకెలా మెరుగవ్వాలనే విషయాలపై గురించి ఆలోచించాలని మాజీ బ్యాట్స్‌మెన్‌ పేర్కొన్నాడు. కాగా, మొదటి నుంచీ పలువురు మాజీలు మూడో టెస్టు పిచ్‌ను విమర్శిస్తుండగా పీటర్సన్‌ ఒక్కడే సానుకూలంగా స్పందించాడు. ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయరని ఇటీవల ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. దానికి రోహిత్‌ శర్మ సైతం స్పందిస్తూ.. మమ్మల్ని ఒక్కరే అర్థం చేసుకున్నారని బదులివ్వడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని