లైంగికదాడి కేసు: నిందితుడికి 20ఏళ్ల జైలు
close

తాజా వార్తలు

Published : 25/03/2021 06:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లైంగికదాడి కేసు: నిందితుడికి 20ఏళ్ల జైలు

ఖమ్మం (న్యాయవిభాగం): ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటో ప్రత్యేక ఫోక్సో (ఫాస్‌ట్రాక్‌) కోర్టు న్యాయమూర్తి డానీరుత్‌ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన గరేళ్లి కొండయ్య 2018లో మేస్త్రీ పని కోసం మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మధిర ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. సదరు కేసును విచారించిన న్యాయమూర్తి.. నిందితుడిపై నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని