‘ఆది పురుష్‌’లో సీత ఎవరు?
close

తాజా వార్తలు

Published : 26/08/2020 09:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆది పురుష్‌’లో సీత ఎవరు?

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా ‘ఆదిపురుష్‌’ తెరకెక్కబోతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సన్నాహాలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. నటీనటుల    ఎంపికపై దృష్టి పెట్టింది చిత్రబృందం. రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరాముడిగా ప్రభాస్‌ నటిస్తారు. సీత పాత్ర విషయంలో పలువురు కథానాయికల పేర్లు తెరపైకొస్తున్నాయి.

తాజాగా కియారా అడ్వాణీ పేరు వినిపిస్తోంది. చిత్రబృందం ఆమెని సంప్రదించారని తెలిసింది. ఇటీవల దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ కథానాయిక పేరూ వినిపించింది. మరి సీత పాత్రలో ప్రభాస్‌ సరసన సందడి చేసే ఆ భామ ఎవరనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రభాస్‌ త్వరలోనే ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని పూర్తి చేయడం కోసం రంగంలోకి దిగుతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని