close

తాజా వార్తలు

Updated : 01/03/2021 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: ప్రజలు కేసీఆర్‌ కుటుంబ పాలన పట్ల విసుగుచెంది మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. తాము గెలవకపోయినా పర్వాలేదు.. భాజపా మాత్రం గెలవొద్దనే విధంగా తెరాస నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  తెరాసకు ప్రత్యామ్నాయ శక్తి భాజపాయే అని చెప్పారు. మేధావులు, పట్టభద్రులు ఆలోచించి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాల్లోనూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని