నిరుద్యోగులను తెరాస మోసం చేసింది: కిషన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Published : 11/04/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరుద్యోగులను తెరాస మోసం చేసింది: కిషన్‌రెడ్డి

నాగార్జున సాగర్‌: నిరుద్యోగులను తెరాస సర్కారు మోసం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్‌లో భాజపా అభ్యర్థి రవికుమార్‌ తరఫున ఇవాళ ఆయన ప్రచారం చేశారు. అనుముల మండలం పులిమామిడి, మారెపల్లి, అన్నారంలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌, తెరాస.. సాగర్‌కు చేసిందేం లేదని ఆయన విమర్శించారు. భాజపాను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాగా, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరగనున్న నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తెరాస తరఫున నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత జానారెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని