
తాజా వార్తలు
నెక్లెస్ రోడ్లో భాజపా పతంగోత్సవం
హైదరాబాద్: తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనలేని వ్యవస్థ వచ్చినప్పుడే ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు వస్తాయని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన పతంగోత్సవాన్ని భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్‌తో, ఎమ్మెల్సీ రామచందర్రావులతో కలిసి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
జోడి నెం.1గా మోదీ, అమిత్‌షాను పేర్కొంటూ ముద్రించిన పతంగులను నింగిలోకి ఎగురవేసిన కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ అన్ని రంగాల్లో సానుకూలమైన మార్పు తీసుకు రావాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాక్సిన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడినపడుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..
సంక్రాంతి వేళ.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
ట్రంప్ ఖాతాను నిషేధించడం సరైనదే